Surprise Me!

Kommineni Srinivasa Rao Arrest - హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు | Oneindia Telugu

2025-06-09 59 Dailymotion

Kommineni Srinivasa Rao - Senior Journalist kommineni Srinivasa Rao arrest in journalist colony in Hyderabad.


Kommineni Srinivasa Rao - సాక్షి టీవీ యాంకర్‌ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అమరావతి మహిళలను కించపరిచిన కేసులో ఆయన్ను అరెస్టు చేశారు. హైదరాబాద్‌ జర్నలిస్టు కాలనీలోని ఆయన ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఏపీకి తీసుకువెళ్తున్నారు. కొమ్మినేనిపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. సాక్షి టీవీ ఛానెల్‌లో చర్చ సందర్భంగా అసభ్య వ్యాఖ్యల అంశంలో రాజధాని రైతులు, మహిళలు, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కంభంపాటి శిరీష ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అమరావతిలో ఉన్న తాడికొండ ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గంలోని దళిత మహిళలను అవమానించారన్న ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు తెలుస్తోంది. కొమ్మినేనితోపాటు జర్నలిస్ట్‌ కృష్ణంరాజు, సాక్షి యాజమాన్యంపైనా కేసు నమోదు చేశారు.

#kommineniSrinivasaRao
#KSRLiveShow
#Amaravati
#SakshiTv
#YSJagan
#AmaravatiWomen
#Amaravatifarmers

Also Read

జగన్ సాక్షి కేసులో తగ్గేదేలే అంటున్న నారా లోకేష్, వస్తావా !! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/minister-nara-lokesh-who-appeared-in-the-court-in-the-case-against-sakshi-magazine-408303.html?ref=DMDesc

కోడిపందాల పుకార్లపై చింతమనేని ఫైర్- లేకుండానే ఉన్నానంటారా ? కేసీఆర్, జగన్ పై పోస్ట్ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/former-tdp-mla-chintamaneni-prabhakar-says-cockfight-rumours-fake-fb-post-on-jagan-kcr-321516.html?ref=DMDesc

సీఎం జగన్ కు బిగ్ రిలీఫ్ - సాక్షిలో పెట్టుబడులు సక్రమమే : సీబీఐవి ఆరోపణలే- కొట్టివేత..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/itat-quashes-it-s-allegations-in-cm-jagan-jagathi-publications-investments-case-310253.html?ref=DMDesc



~PR.358~ED.232~